Category Archives: వ్యాసం

వివిధ పత్రికల్లో ప్రచిరితం అయిన నా వ్యాసాలు ఇవి . జర్నలిస్టు గా , సాహిత్యకారుడిగా ఇవి నా స్పందనలు. నా పరిసీలనలు.

ఆకుపచ్చ యాత్ర

శేషాచలం-శ్రీవేంకటేశ్వరుడు కొలువైన తిరుమల లోయ. ఔషధవనాలుండే అందమైన కొండ. అన్నమయ్య ఆడి పాడి తిరుగులాడిన ప్రదేశం. కానీ, ఇప్పుడిది ‘ఎర్ర’దొంగల రాజ్యం. ప్రపంచంలోనే అరుదైన, అద్భుతమైన ఎర్రచందనం మహావృక్షాలు తెగనరికి దోచుకునే దుర్మార్గులు నడయాడే చోటు. లక్ష కోట్ల విలువైన ‘ఎర్ర’బంగారం కొండ దాటించిన దొంగలు, దాడులకీ, హత్యలకీ కూడా తెగబడుతున్న నేల. ‘కౌంటర్‌’లూ ‘ఎన్‌కౌంటర్‌’లతో ‘ఎర్ర’బీభత్స ప్రదేశంగా తరచూ వార్తలకెక్కుతున్న శేషాచలం నిజానికి ఒక అందచందాల అడవి. వాగులు వంకల వయ్యారాలతో ఎన్నో తీర్ధాలున్న చల్లని కొండ. మార్మిక సౌందర్యం స్వాగతించే ఆకుపచ్చలోయ. వందల ఏళ్ళుగా ఈ కొండకోనలు ఎందరో యోగులకు ఆవాసాలయ్యాయి. ఈ చెట్లూ పుట్టల వెంటబడి నడిచి తీర్ధాలకు చేరుకున్న వారికి ఇప్పటికీ ఎన్నో అనుభూతులనిస్తున్నాయి. భక్తులకు పుణ్యాన్నీ, అడవి ఆరాధకులకు సౌందర్యానుభూతినీ మిగులుసున్నాయి. నెత్తుటి మరకల లోయగా ముద్రపడ్డ తిరుమల అడవుల్లోకి సాగిన అందమైన యాత్రపై అనుభూతి కథనం…. చదవడం కొనసాగించండి

Posted in వ్యాసం | 1 వ్యాఖ్య

మా ఊళ్ళో పండగ

మా ఊరంటే ఎంత ఇష్టమో, పండగలన్నా అంతే ఇష్టం నాకు. ఉద్యోగంలో ఎంత వత్తిడి ఉన్నా, సర్దుబాటు చేసుకునో, ఎగ్గొట్టో ప్రతి పండక్కీ ఊరికి పరిగెత్తుతూ ఉంటాను. మరీ సంక్రాంతి రోజుల్లో ఊళ్లో గడపడం..గొప్ప హాయినీ, శక్తినీ యిస్తుంది. అయితే, మూడేళ్ళుగా పండగలు గాయాలే మిగిల్చాయి. ప్రతి గాయాన్నీ బింకంగా సవాల్ చేయడానికే ప్రయత్నించాను. ఊరంటే … చదవడం కొనసాగించండి

Posted in వ్యాసం | వ్యాఖ్యానించండి

రాకెట్‌ ఎగిరినపుడంతా మొగల్తూరు రైతే గుర్తొస్తాడు

మొగల్తూరు అనగానే టక్కున చిరంజీవి గుర్తొస్తాడు. అరే, కృష్ణంరాజుదీ అదే ఊరు కదా అనుకుంటాం. ఈ సినిమా వ్యవహారం పట్టని పాత తరం వాళ్ళయితే, బారిష్టర్‌ పార్వతీశంని గుర్తు చేసుకుంటారు. ఈ ముగ్గురూ కాకుండా నాలుగో హీరోని ఇప్పుడు పరిచయం చేస్తున్నాం. పేరు ఎంవైఎస్‌ ప్రసాద్‌. శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం డైరెక్టర్‌. అంతరిక్ష శాస్త్రవేత్తగా అంతర్జాతీయ ఖ్యాతి గడించినవాడు. పాతిక దేశాలు తిరిగినవాడు. ఐక్యరాజ్య సమితిలో భారత దేశపు అంతరిక్ష స్వరాన్ని పదకొండేళ్ళ పాటు వినిపించినవాడు. ఉపగ్రహాన్ని మోసుకుని మన నేల మీద నుంచీ ఎగిరిన తొలి రాకెట్టు ఎస్‌ఎల్‌వీ నుంచీ నిన్నటి పీఎస్‌ఎల్‌వీ-సి20 దాకా ప్రతి ప్రయోగంలోనూ భాగం అయినవాడు. మన దేశపు ఖ్యాతిని అంతరిక్షంలో రెపరెపలాడిస్తున్న శాస్త్రవేత్త ప్రసాద్‌ పుట్టి పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో. ప్రసాద్‌ మొగల్తూరు జ్ఙాపకాలే ఈ వారం మా ఊరు.. చదవడం కొనసాగించండి

Posted in వ్యాసం | 2 వ్యాఖ్యలు

అక్షరాల పిచ్చోడు మా అన్న

పండగ వెళ్ళిపోయింది. ఒక్క నిప్పటి అయినా తినకుండానే, ఒక్క మురుకు ముక్క అయినా కొరక్కుండానే పండగ వెళ్ళిపోయింది. భగభగలాడే భోగి మంట చుట్టూ భోగే..భోగి అని అరుస్తూ తిరిగే మా పిలకాయల చేతుల్లో మోగించడానికి ఈసారి డప్పులు లేవు. ఊళ్లూ, వీధులూ తిరిగి వెతికి వెతికి డప్పులు తేవడానికి ఈసారి మా అన్న లేడు. మా … చదవడం కొనసాగించండి

Posted in వ్యాసం | 5 వ్యాఖ్యలు

మన్నించు మహానుభావా!

నటరాజ రామకృష్ణ గురించి వినడమూ, చదవడమే తప్ప అంతకుముందు ఎప్పుడూ ఆయనను నేను చూడలేదు. నటరాజ రామకృష్ణను కలవచ్చనే ఆశతో హైదరాబాద్‌ వచ్చిన మా నాయన కోసం ఆయన గురించి ఆరా తీశాను. ‘ఆయనకు చాలా కోపం. ఆయనకు నాట్యం తప్ప మరే విషయాలూ పట్టవు. ఎవరంటే వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడరు. వెళ్ళి భంగపడతారేమో’.. యిట్లా చాలా హెచ్చరికలే వినాల్సి వచ్చింది. జంకు జంకుగానే మా నాయనను తీసుకుని బయలుదేరాను. చదవడం కొనసాగించండి

Posted in వ్యాసం | 4 వ్యాఖ్యలు

కొత్తపాలెం… ఆంధ్రా అమెజాన్

మీరు అనకొండ సినిమా చూశారా? దట్టమైన అమెజాన్ అడవుల్లో మెలికలు తిరుగుతూ పారే నది. ఒక క్షణం అందం.. మరు క్షణం భయం .. వింత సౌందర్యం. హృదయం పురివిప్పిన కాసేపటికే వొళ్ళు భయంతో బిగుసుకుపోతుంది. చిత్తడి చిత్తడి నేల..చిక్కగా అల్లుకుపోయిన చెట్లు..పగలు కూడా చీకటి కమ్మేసిన అడవి.. వోహ్.. ఆ సౌందర్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని … చదవడం కొనసాగించండి

Posted in వ్యాసం | 1 వ్యాఖ్య

నేను దేవదాసీని..నేను నాగరత్నమ్మను

ఒళ్ళో కుక్క పిల్లను పెట్టుకుని కుర్చీలో దర్జాగా కూర్చుని ఉన్న బెంగుళూరు నాగరత్నమ్మ ను చూస్తే నాకెందుకో మా నెల్లూరత్త గుర్తొస్తుంది. నల్లని వొళ్ళు, ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడే తెల్లని కళ్ళు, దృఢంగా పలికే గొంతు మా నెల్లూరత్తది, అచ్చం నాగరత్నమ్మకు లాగే. తన సహచరుడు దీపక్‌ సేన్‌తో కలిసి నలభై యాభై యేళ్ళ కిందటే డిటెక్టివ్‌ నవల్లు చదువుతూ విమానాల్లో విహరించిన మా సరోజన పిన్నమ్మ కూడా సరీగ్గా ఇట్లాగే వుండేది. మా మనోరంజనవ్వ, మా సౌందర్యక్క, మా జగదాంబవ్వ, మా మిద్దింటత్త.. మా ఊళ్ళో చాలా మంది కళ్ళు ఒకప్పుడు ఇలాగే మెరుస్తూ ఉండేవి. పూజా పునస్కారాలతో మన్నారుస్వామి గుడి వైభవంగా ఉండే రోజుల్లో ఎందరో నాగరత్నమ్మలతో మా ఊరు కళ కళలాడేది. చదవడం కొనసాగించండి

Posted in వ్యాసం | 1 వ్యాఖ్య

గోపురాలు కూలుతున్నాయ్‌

కూలింది ప్రస్తుతం శ్రీకాళహస్తి గోపురమే కావచ్చు, కూలడానికి మన రాష్ట్రంలో మరెన్ని సిద్ధంగా ఉన్నాయి? కనీసం వీటినైనా కాపుడుకోగలమా? ఇందుకోసం ఒక ప్రయత్నాన్ని శ్రీకాళహస్తి సాక్షిగా అయినా ప్రారంభించకపోతే చరిత్ర మనల్ని ఎన్నటికీ క్షమించదు. ఇందుకోసం మన ప్రభువులకు కావలసింది ప్రాచీన స్పృహ. పురా సంపదను కాపాడుకోవాలనే చిత్తశుద్ధి. చదవడం కొనసాగించండి

Posted in వ్యాసం | వ్యాఖ్యానించండి

నమస్తే అన్నా..నమస్తే అక్కా..నమస్తే,నమస్తే..

ఏమైంది వంగపండు కి? ఏమైంది వేణుకి? ఏమైంది ఖదీర్ కి , వనజ కి , కొణతం దిలీప్ కి ? ఎక్కడ మునిగి , ఎక్కడ తేలారు ? తేలారా, మునిగారా ? ఓహ్ , ఎటువంటి కాలం ఇది .. ఎంత వింత దృశ్యాలని కనుల ముందు వుంచుతోంది.. అడవులు, అమరత్వము, వెన్నెలా, … చదవడం కొనసాగించండి

Posted in వ్యాసం | 3 వ్యాఖ్యలు

తల తిమురుబట్టిన నామిని కత

-నేను వూరికే పై పైన మాట్లాడ్డంలా. వీళ్ళందర్నీ నేను చదివినాక , రెక్కల కష్టం చేసిన వాడిగా నాకు అర్తమైంది ఏమంటే.. వీళ్ళెవురూ రైతులగురించి నిజం రాయలేదు. రైతుల మింద కతలల్లారు నా బిడ్డల మింద ప్రమాణం చేసి చెబుతున్నా.. ఈ రచయితలంతా రైతుల్ని, రైతుల భార్యల్ని, రైతుల బిడ్డల్ని హింసలు పెట్టారు.. అంతా జూటా రాతలు.. దాసరి నారాయణరావు దర్శకత్వం టైపు. ఇంకా చెప్పాలంటే ,-కళా తపస్వి- విశ్వనాధ్‌ టైపు చదవడం కొనసాగించండి

Posted in వ్యాసం | 1 వ్యాఖ్య